

హైదరాబాద్ నగరంలో మున్సిపల్ డివిజన్ల పునర్విభజనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను 300 నుంచి 400 వరకు పెంచే ప్రణాళికలు రూపొందుతున్నాయి. నగర విస్తరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనా సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుత ప్రణాళికల ప్రకారం జీహెచ్ఎంసీలో 150 నుంచి 200 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో 76 నుంచి 100, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74 నుంచి 100 డివిజన్లకు పెంపు ఉండనుంది. గతంలో జీహెచ్ఎంసీని 150 నుంచి 300 డివిజన్లకు విస్తరించి మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం, ఇప్పుడు మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. నవంబర్లో జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించి, అనంతరం సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. జీహెచ్ఎంసీ 200 డివిజన్లకు పెరిగితే, మేయర్ పదవికి కనీసం 101 స్థానాలు గెలవాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!