

పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు పెదపాడు గ్రామంలో కొత్త పాఠశాల భవనం నిర్మాణం పూర్తైంది. గత ఏడాది అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో అడవితల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలోని శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆ సమయంలో కొత్త భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వగా, ఇప్పుడు రూ.17.50 లక్షల వ్యయంతో ఆధునిక పాఠశాల భవనాన్ని నిర్మించారు.
ఈ కొత్త పాఠశాల భవనం వల్ల గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందనుంది. త్వరలో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఈ భవనం అందుబాటులోకి రానుంది. చాపరాయి నుంచి పెదపాడు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గ్రామ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కళ్యాణ్, విద్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నిర్మాణం గిరిజన ప్రాంత అభివృద్ధిలో కీలక అడుగుగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!