
జనరల్

పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు, రోడ్ల పరిస్థితి వంటి వివరాలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డ్ రూపొందించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా పారదర్శకంగా పన్నుల వసూళ్లు నిర్వహించిందని తెలిపారు.
ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ప్రారంభించిన గ్రీన్ షాప్ ప్రాజెక్ట్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలలో స్వచ్ఛరథాల ద్వారా 18.86 లక్షల కేజీల చెత్త సేకరించామని, వాటి విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!