
జనరల్

వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ వ్యవస్థ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!