
రాజకీయాలు

హైదరాబాద్ నగరంలో మూడు కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. అల్వాల్ లయోలా కళాశాల, ఆనంద్‌బాగ్, మౌలాలీ ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మించాలని ప్రయాణికులు డిమాండ్ చేయడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపించారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఘట్‌కేసర్–సనత్‌నగర్ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు పెరగడంతో లయోలా కళాశాల వద్ద కొత్త స్టేషన్ అవసరం పెరిగింది. ఆనంద్‌బాగ్ ప్రాంతంలో చర్లపల్లి–నేరేడ్‌మెట్ మధ్య స్టేషన్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మౌలాలీ రైల్వే క్వార్టర్స్ సమీపంలో సుమారు 2,000 కుటుంబాలు నివసిస్తుండటంతో అక్కడ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!