

వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు 100 కేజీల బరువును ఎత్తడం సాధారణమే అయినా, దేశాధ్యక్షుడు అంతే బరువును బెంచ్ ప్రెస్ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్‌సుఖ్ ఓ సైనిక విభాగాన్ని సందర్శించిన సమయంలో అక్కడి జిమ్‌లో వర్కౌట్ చేశారు. సూట్ జాకెట్‌ను పక్కన పెట్టి బెంచ్‌పై పడుకున్న ఆయన 100 కేజీల బరువును ఏకధాటిగా 20 సార్లు ఎత్తారు. దీంతో ఆయన బలం, ఫిట్‌నెస్ చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
2021 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఖురెల్‌సుఖ్ గతంలో మంగోలియా సైన్యంలో అధికారిగా పనిచేశారు. ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా ఓ రాక్ బ్యాండ్‌లో గిటారిస్ట్‌గా కూడా ఉన్నారు. మంగోలియాలో హార్లే-డేవిడ్‌సన్ అభిమానుల క్లబ్‌ను స్థాపించిన ఆయనకు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక ఆసక్తి ఉంది. వీడియోను చూసిన పలువురు ఆయన శక్తి, క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారు. బార్‌పై ఉన్న బరువుపై కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన 100 కేజీల బరువును ఎత్తినట్లు నివేదికలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!