

భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా రంగంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. దేశ రహదారులపై 4 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన తొలి సంస్థగా ఒలెక్ట్రా నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ 4,000వ ఈ-బస్సును హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రికి ఒలెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు అందజేశారు.
అదే కార్యక్రమంలో హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) కోసం కొనుగోలు చేసిన 297 ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పటివరకు ఒలెక్ట్రా ఈ-బస్సులు 73 కోట్ల గ్రీన్ కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసి, 6.5 లక్షల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించాయి. ప్రజా రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులపై ఉంచిన విశ్వాసానికి ఈ ఘనత నిదర్శనమని మహేష్ బాబు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!