

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం ‘పవర్ ఆఫ్ పీపుల్’ థీమ్‌తో కొనసాగుతోంది. ఈసారి హౌస్‌లో తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రేక్షకుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్రేక్షకుల ఎంపిక ఆధారంగా త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలినీ, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, రాం ప్రసాద్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. వీరిలో ఎవరు కెప్టెన్సీ పోటీలో కొనసాగాలి, ఎవరు తప్పుకోవాలనే విషయాన్ని మిగతా హౌస్‌మేట్స్ నిర్ణయించేలా టాస్క్ నిర్వహించారు. ప్రతి కెప్టెన్సీ కంటెండర్‌కు బెలూన్లు కేటాయించగా.. టాస్క్ సాగుతున్న కొద్దీ పలువురు తమ ప్రత్యర్థులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా త్రిగుణ్‌పై దేబ్జానీ, ముఖేష్ తీవ్ర విమర్శలు చేశారు. అతడికి తరచూ కోపం వస్తుందని, ఆధిపత్య ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు.
మరోవైపు రోహిత్ చేసిన వ్యాఖ్యలపై రాం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమన్ షాలినీ యాంగర్ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. దేబ్జానీ భాష విషయంలోనూ హౌస్‌లో చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, బజర్ మోగిన తర్వాత కూడా ముఖేష్ రాస్తున్నాడని షాలినీ ఆరోపించడంతో టాస్క్‌లో మరో వివాదం మొదలైంది. ముఖేష్ విషయంలో త్రిగుణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. తాను న్యాయంగా ఆడటం లేదంటూ ముఖేష్ త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాడు. అనంతరం షాలినీ, వర్షిణి మధ్య ఫేవరిటిజం అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది? కెప్టెన్సీ రేసులో చివరకు ఎవరు నిలుస్తారనేది ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!