
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ సవరించిన వయోపరిమితి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. దీంతో గతంలో వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
అయితే ఈ వయోపరిమితి పెంపు యూనిఫాం పోస్టులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, ఇతర యూనిఫాం విభాగాల ఉద్యోగాలకు పాత నిబంధనలే వర్తించనున్నాయి. నాన్-యూనిఫాం పోస్టుల భర్తీలో వయోపరిమితిని పెంచడం ద్వారా మరింత మంది అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించడమే ప్రభుత్వ నిర్ణయం ఉద్దేశంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!