
జనరల్

భారీ వర్షాలతో నేపాల్‌లో పలు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. త్రిశూలీ నదిలో నీటిమట్టం గణనీయంగా పెరగడంతో వరద ముప్పు మరింత పెరిగింది. గండకీ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం లక్ష క్యూసెక్కులకు చేరినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక, రెస్క్యూ బృందాలకు సవాలుగా మారడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 15 వేలకుపైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు 4,400 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే సహాయక చర్యలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!