

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన స్పందన అందుకుంటున్న నేపథ్యంలో చిత్రబృందం ఆనందంలో ఉంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్ మరియు శ్రీను రవితేజను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. ఇదే సమయంలో రవితేజ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘బ్రిడ్జ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది.
ప్రస్తుతం హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వివేక్ ఆత్రేయతో చేయనున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజను వివేక్ ఆత్రేయ తనదైన ప్రత్యేకమైన కథా ప్రపంచంలో ఎలా చూపిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన కథ, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ అంశాలపై అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. రవితేజ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వ శైలి తోడైతే సినిమా మరింత ప్రత్యేకంగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో అప్పుడే చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!