

యూపీఐ లావాదేవీలపై కొత్తగా పన్ను లేదా సెస్సు విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఎంత మొత్తమైనా పర్సన్-టు-పర్సన్ యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. రూ.2,000 వరకు వ్యాపారులకు చేసే చెల్లింపులతో పాటు జీరో-MDR పరిధిలోని చిన్న వ్యాపారుల లావాదేవీలకు కూడా ఛార్జీ ఉండదు. దీంతో దాదాపు 96 శాతం P2M లావాదేవీలు ప్రభావితం కావని ప్రభుత్వం తెలిపింది. MDR అనేది ప్రభుత్వం లేదా NPCI వసూలు చేసే పన్ను కాదని, పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని బ్యాంకులు, పేమెంట్ యాప్ ప్రొవైడర్ల మధ్య పంపిణీ అయ్యే రుసుమని స్పష్టం చేసింది.
మరోవైపు యూపీఐ ఛార్జీలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై సీతారామన్ విమర్శలు చేశారు. రూ.2,000కు పైబడిన నిర్దిష్ట P2M లావాదేవీలకు 0.4 శాతం MDR వర్తించినప్పటికీ, ఆ భారాన్ని వినియోగదారులపై మోపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇండోర్‌లో రాహుల్ గాంధీ పాల్గొన్న ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాజ్యాంగ పదవులకు సంబంధించిన మిమిక్రీ ప్రదర్శనపై సీతారామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛతో పాటు రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం కూడా ఉండాలని ఆమె పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!