

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. 1940ల నాటి స్వాతంత్ర్య పూర్వ కాలం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.
అయితే సాంకేతిక కారణాల వల్ల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తికావడం లేదని నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఫౌజీ’ రిలీజ్‌పై స్పందించిన ఆయన, కొత్త విడుదల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన తేదీ ఖరారైన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటివరకు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులను కోరారు. ఆలస్యమైనా ప్రేక్షకులకు అద్భుతమైన అవుట్‌పుట్ అందిస్తామని, సినిమాలో ఐదు పాటలు ఉంటాయని, ప్రభాస్‌ను గతంలో ఎన్నడూ చూడని ఎపిక్ స్థాయిలో చూపించబోతున్నామని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!