

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన నూతన ట్రస్ట్ బోర్డు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య మన్నె సత్యనారాయణరెడ్డి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సభ్యులుగా కొణిదెల సురేఖ, జి. వినోద్ వెంకటస్వామి, చిలప్పుగారి విజయరాజం, విజయేందర్ తుల్ల, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంతమనేని, ఎం. రాఘవేంద్రరావు, డి. లక్ష్మీనారాయణ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన సేవలు అందించేందుకు నూతన పాలక మండలి అంకితభావంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈఓ), ఆలయ ప్రధాన అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!