

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం తుంగభద్ర ప్రాజెక్టుకు కీలక ఘట్టంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త స్పిల్‌వే గేట్లను ఏర్పాటు చేశాయి. ఈ కొత్త గేట్లతో డ్యాం నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు నీటి వినియోగం, పంపిణీ మరింత సమర్థవంతంగా సాగనుంది.
గేట్ల ప్రారంభోత్సవం అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి హోస్‌పేట్‌లోని బహిరంగ సభా వేదికకు చేరుకున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఆయన వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!