
జనరల్

తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 2 తర్వాత కొత్త ధరలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని రకాల మద్యం బ్రాండ్లపై 10% నుంచి 15% వరకు ధరల పెంపు ఉండే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
మద్యం ధరల మార్పులు, ఆదాయ వనరుల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రంలో మద్యం ధరలను 25% నుంచి 30% వరకు పెంచాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్కువ స్థాయిలోనే ధరల పెంపు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బీర్లు, ఐఎంఎల్ లిక్కర్ ధరలు మరింత భారం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!