
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. 'లెనిన్' చిత్ర సక్సెస్ మీట్‌లో నటుడు శివాజీ ఏపీకి సినీ పరిశ్రమను తీసుకురావాలని చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి, రాష్ట్రంలో సినీ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కోసం పెట్టుబడిదారులు ముందుకు వస్తే వారికి అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కందుల దుర్గేశ్ హామీ ఇచ్చారు. ఈ చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!