
సినిమాలు

నాగచైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ విడుదలకు ముందే భారీ నాన్-థియేట్రికల్ డీల్ కుదుర్చుకున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా డిజిటల్ సంస్థలు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, జీ గ్రూప్ ఈ చిత్రం ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను కలిపి సుమారు రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి సినిమాపై అంచనాలను మరింత పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!