

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం భద్రతా కారణాలతో రహస్యంగా విమానం మార్చిన ఘటనపై నెట్‌ఫ్లిక్స్ ‘ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణించిన వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ జర్నలిస్టులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, విమాన సిబ్బంది ప్రత్యక్ష అనుభవాలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ నెల 4 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.
నాటో సదస్సు కోసం ట్రంప్ ఖతార్ బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తుర్కియే వెళ్లారు. అయితే ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న తుర్కియేలో ఆ విమానం భద్రతపై నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, భద్రతా సిబ్బంది రహస్యంగా విమానం మార్చే ప్రణాళిక రూపొందించారు. అంకారా విమానాశ్రయంలో కెమెరాల ముందు ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కిన ట్రంప్‌ను, అనంతరం ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు సాయంతో రన్‌వేపై సిద్ధంగా ఉన్న చిన్న మిలిటరీ విమానంలోకి మార్చారు. ఆ విమానంలో ఆయన బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ మైల్డెన్‌హాల్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!