
షోస్

జనసేన పార్టీ యువజన విభాగానికి ‘జై కొట్టు’ అనే పేరును ఖరారు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ లోగోను ఆవిష్కరించారు. యువజన విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడియో సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత రెండు మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అయినప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తుంటారని చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరించిందని, జగన్‌ను ఎదుర్కొని కూటమి విజయానికి జనసేన పార్టీ కృషి చేసిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!