

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ‘ఛార్జ్‌షీట్’ విడుదల చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, తాగునీరు, శాంతిభద్రతలు వంటి రంగాలు దెబ్బతిన్నాయని హరీశ్ రావు ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు వ్యవస్థలు బలహీనపడ్డాయని హరీశ్ రావు విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఏడు రోజుల నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!