
జనరల్

భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో సమగ్ర కుల జనగణన నిర్వహించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్లోని ప్రజా భవన్లో జరిగిన “క్యాస్ట్ సెన్సస్: డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని కులాల సామాజిక, విద్యా, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించడం అత్యంత అవసరమని సూచించారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ విధమైన డేటా ఆధారిత చర్యలు సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని, సంక్షేమ పథకాల అమలులో సమానత్వాన్ని తీసుకురావడంలో కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కుల జనగణన నిర్వహించడం ద్వారా అసమానతలను గుర్తించి సమర్థవంతమైన విధానాలను రూపొందించవచ్చని భట్టి విక్రమార్క వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!