

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలుసుకుని వారి నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు, ప్రతినిధులు అందించిన అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్‌తో పాటు విద్యాశాఖలో పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. గిరిజన బంజారా తండాల్లోని ఆలయ పూజారులకు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు బంజారా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనం పెంచాలని గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ కోరింది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లె గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు శ్మశానవాటికకు బీటీ రోడ్డు నిర్మించాలని సి. విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!