
క్రీడలు

చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత ప్రదర్శన కొనసాగించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ స్కారప్ రాస్ముసెన్ జోడీతో హోరాహోరీగా తలపడిన భారత జోడీ 21-13, 16-21, 21-18తో విజయం సాధించింది. మూడు గేమ్‌ల పోరులో పట్టుదలగా ఆడి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
మరోవైపు భారత వెటరన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్‌ఫైనల్‌తోనే ముగిసింది. 33 ఏళ్ల శ్రీకాంత్ ప్రపంచ 25వ ర్యాంకర్, హాంకాంగ్‌కు చెందిన లీ చియా-హావో చేతిలో 16-21, 16-21 తేడాతో వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో టైటిల్ ఆశలను సాత్విక్-చిరాగ్ జోడీ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!