3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Shivani K 09:05 PM, 3 సెప్టెంబర్, 2026
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం, డిజైన్ల ఫోటో ప్రదర్శనను పరిశీలించిన సీఎం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ప్రారంభోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేసి వదిలేసిందని, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం నిధులు సమకూర్చి పనులను పూర్తి చేసిందన్నారు. “ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ” అని పేర్కొంటూ, ఈ ప్రాంతంలోని ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బలాలా కళాశాల అభివృద్ధికి కోరిన రూ.20 కోట్లకు బదులుగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

విద్యాభివృద్ధికి అవసరమైనంత నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ దేశభక్తి విషయంలో అందరూ ఒక్కటేనని, ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. మీరాలం చెరువులో మూడు కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని, వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడంతో పాటు నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరిస్తామని వెల్లడించారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యమని, హిందూ–ముస్లింలు కలిసి నడిస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిచంచల్‌గూడ ఫ్లైఓవర్సంతోష్‌నగర్ ఫ్లైఓవర్హైదరాబాద్ అభివృద్ధిఓల్డ్ సిటీఒరిజినల్ సిటీఅసదుద్దీన్ ఓవైసీహైదరాబాద్ మెట్రోమూసీ రివర్‌ఫ్రంట్తెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్
జనరల్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో
సినిమాలు

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!