

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, అందుకే మిర్యాలగూడలో రైతు మహాధర్నా నిర్వహించాల్సి వచ్చిందని అన్నారు. మిర్యాలగూడను తెలంగాణ రైస్ బౌల్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయాల్సిన సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారని, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారని గుర్తుచేశారు.
రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారని, అయితే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు పథకాన్ని మూడుసార్లు నిలిపివేసిందెవరో ప్రజలు ఆలోచించాలని, రైతుబీమా ప్రయోజనాలను కూడా సక్రమంగా అందించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మవద్దని కేసీఆర్ గతంలోనే చెప్పారని పేర్కొన్న కేటీఆర్, రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!