

టీమిండియా స్టార్ బ్యాటర్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పంజాబ్‌లో జరిగే షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ టోర్నీలో ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున గిల్ ఆడనున్నాడు. సెప్టెంబర్ 5న బటిండా రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన గిల్, శ్రీలంక టెస్ట్ సిరీస్ కారణంగా టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో సన్వీర్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించగా, ఫాల్కన్స్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించి, రెండు ఓటములతో ఆరు జట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
షేర్-ఎ-పంజాబ్ లీగ్‌లో గిల్‌తో పాటు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ వంటి పలువురు స్టార్లు కూడా ఆడుతున్నారు. టీ20ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో గిల్ భారత జట్టు నుంచి దూరమయ్యాడు. 2025 డిసెంబర్‌లో తన 36వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత అతడు ఇప్పటివరకు టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. ఈ లీగ్‌లో మంచి ప్రదర్శన చేసి మరోసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్ భావిస్తున్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!