8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

Writer: Harika S 01:04 PM, 8 అక్టోబర్, 2026
కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

విలక్షణ నటుడిగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానా పటేకర్‌కు సైన్యంతోనూ ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో దేశానికి తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆర్మీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను కలిసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాధారణ పౌరులు నేరుగా ఆర్మీలో చేరడం సాధ్యం కాదని ఫెర్నాండెజ్ చెప్పినప్పటికీ, తాను కమాండో కోర్సు పూర్తి చేశానని, ఆయుధాల వినియోగంలో అనుభవం ఉందని నానా పటేకర్ వివరించారు.

జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన విషయాన్ని కూడా ఆయన రక్షణ మంత్రికి తెలిపారు. ఆయన వివరాలు విన్న అనంతరం ఎప్పుడు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఫెర్నాండెజ్ అడగగా, తాను సిద్ధంగా ఉన్నానని నానా పటేకర్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత సుమారు 60 రోజుల పాటు ఆర్మీతో కలిసి పనిచేశారు. ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సోపోర్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపారు. అయితే సైనికులతో కలిసి నిర్వహించిన కార్యకలాపాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కార్గిల్‌కు వెళ్లే సమయంలో తన బరువు 76 కేజీలు ఉండగా, తిరిగి వచ్చేసరికి 56 కేజీలకు తగ్గిందని, ఆర్మీతో కలిసి పనిచేస్తున్న సమయంలో సమయమే తెలియలేదని నానా పటేకర్ గతంలో గుర్తుచేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భూప్రకంపనలు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

తెలంగాణలో మండుతున్న ఎండలు..

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ట్యాగ్లు
నానా పటేకర్కార్గిల్ యుద్ధంభారత సైన్యంజార్జ్ ఫెర్నాండెజ్బాలీవుడ్భారతీయ సినిమాకార్గిల్ యుద్ధ కథలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!