

గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో అమల్లోకి వచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. కొత్త చట్టం పేరుకే ఉపాధి హామీ ఇస్తోందని, వాస్తవానికి ఇది ‘రోజ్‌గార్ చోరీ’ అని ఆయన విమర్శించారు.
2026 జులైలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో భారీ తగ్గుదల కనిపించిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ఆధారంగా ప్రచురితమైన ఓ మీడియా కథనాన్ని సోమవారం ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన. 2025 జులైలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద లభించిన ఉపాధితో పోలిస్తే, 2026 జులైలో కొత్త పథకం కింద ఉపాధి గణనీయంగా తగ్గిందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థను కేంద్రం బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!