
జనరల్

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ తెలంగాణ దిశగా కదులుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గోవా, తమిళనాడు సహా అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD పేర్కొంది. ఆ తర్వాత కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!