
జనరల్

అసెంబ్లీ ఆవరణలో ఉన్నతాధికారి పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితిలో సమయస్ఫూర్తితో స్పందించి అధికారికి తక్షణ సహాయం అందించారు.
అనంతరం వైద్య సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి, అంబులెన్స్ ద్వారా పీఎస్ రాజును ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి శ్రీహరి తక్షణ స్పందన, మానవత్వంతో వ్యవహరించిన తీరును అక్కడ ఉన్న పలువురు ప్రశంసించారు. అత్యవసర సమయంలో బాధితుడికి అండగా నిలిచిన మంత్రిపై అభినందనలు వ్యక్తమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!