
జనరల్

విజయవాడలో వీసా స్కామ్ కేసుకు సంబంధించి యూట్యూబర్ నందనకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నందనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తులో భాగంగానే నందనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, ఇతర వివరాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆమె విచారణకు హాజరైన తర్వాత కేసులో తదుపరి పరిణామాలు వెలువడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!