
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు పార్టీ విప్ జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని, సభ ముగిసే వరకు సభలోనే ఉండాలని ఆదేశించింది. చర్చల్లో పార్టీ నిర్ణయించిన వైఖరి ప్రకారమే పాల్గొనాలని, బిల్లులు, మోషన్లపై బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయాలని కౌన్సిల్ విప్ దేశపతి శ్రీనివాస్ సూచించారు.
విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత చర్యలు తప్పవని బీఆర్ఎస్ హెచ్చరించింది. యాంటీ డిఫెక్షన్ చట్టం కింద సంబంధిత సభ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కౌన్సిల్‌లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్సీలంతా ఐక్యంగా వ్యవహరించేలా ఈ విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!