
షోస్

ప్రముఖ గాయని ష్రేయా ఘోషల్ తన భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయతో ఉన్న అందమైన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా శిలాదిత్య ఎప్పుడూ తనకు అండగా నిలుస్తారని ఆమె తెలిపారు. తన వృత్తి అవసరాలను ఆయన అర్థం చేసుకుంటారని చెప్పారు.
పని కారణంగా నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినా భర్త ఎప్పుడూ తనను అపరాధ భావనకు గురి చేయరని ష్రేయా తెలిపారు. ఇంటి బాధ్యతలను కూడా సంతోషంగా చూసుకుంటారని చెప్పారు. తమ బంధం నమ్మకం, అవగాహన, సమానత్వంపై కొనసాగుతోందని, తమ మధ్య ఈగోకు చోటు లేదని పేర్కొన్నారు. ఇక కుమారుడు దేవయాన్ తమ ప్రపంచానికి కేంద్రబిందువుగా ఉన్నాడని ష్రేయా తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!