

చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నటుడు రవి మోహన్ వెయ్యికి పైగా అభిమానులను కలుసుకుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ క్లబ్ బాధ్యుడు రవి మోహన్ తమ అభిమానుల తరఫున గొంతెత్తి నాయకత్వం వహించాలని కోరారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో రవి మోహన్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ మొదలైంది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రవి మోహన్.. నటులు అభిమానులను కలిసిన ప్రతిసారీ దానిని రాజకీయ కోణంలో చూడటం సాధారణమైపోయిందని అన్నారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని స్పష్టం చేశారు. ఇతరులకు మంచి చేయడానికి తప్పనిసరిగా రాజకీయ పదవి అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న చర్చకు ఆయన తన వైఖరిని స్పష్టం చేసినట్లైంది.
అయితే భవిష్యత్తులో అవసరం ఏర్పడితే రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదని రవి మోహన్ తెలిపారు. జీవితంలో ఎదురైన వైఫల్యాలు తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని, తాను ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి భయపడలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రవి మోహన్ రాజకీయ భవిష్యత్తుపై అభిమానుల్లో, సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!