

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 29న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధ మహిళలు సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములను చేస్తూ ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యంపై వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 25న సౌరవిద్యుత్ ప్లాంట్ల ప్రారంభం, 26న సామాజిక సమీకరణ దినం, 28న మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలు, 29న రుణమేళాలు, 30 మరియు 31 తేదీల్లో మహిళల భద్రతకు సంబంధించిన మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!