
జనరల్

ఏ. రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రఘవీర్ రెడ్డి, రాజ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. నిరుపేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, ప్రజా సంక్షేమానికి చూపిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయని కొనియాడారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!