
జనరల్

తెలంగాణలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. ప్రతి రోజు 10 జిల్లాల్లో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ఆధ్వర్యంలో ఈ శిక్షణలు నిర్వహించనున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది.
ఈ శిక్షణలో 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, వీబీజీ, ఆర్జీ పథకాలు, పచ్చదనం-స్వచ్ఛదనం, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బందికి మంత్రి సీతక్క దిశానిర్దేశం చేయనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!