
జనరల్

ఇటీవల విడుదలైన మలయాళ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోస్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అభిలాష్ ఆర్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిజు విల్సన్, జగదీష్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా, ప్రముఖ సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. ఉత్కంఠభరితమైన కథ, ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్, ఆహా తమిళం, మనోరమ మ్యాక్స్, లయన్స్‌గేట్ ప్లే వేదికలపై స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!