10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

Writer: Pooja 06:14 PM, 10 అక్టోబర్, 2026
అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం CRDA, ADCL ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో వర్షాల కారణంగా నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఐకానిక్ టవర్లలో తొలి డయాగ్రిడ్ నిర్మాణం పూర్తయిందని, ప్రతి రెండు నెలలకు ఆరు అంతస్తుల చొప్పున నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాది పనులు దాదాపు పూర్తయ్యాయని, అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలు కూడా తుది దశకు చేరుకుంటున్నాయని వివరించారు. నవంబర్ 11 తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలుపెడతామని వెల్లడించారు.

రాజధానిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సుమారు 35 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ప్రకారం 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ కోసం చేపట్టిన భూసమీకరణ చాలావరకు పూర్తయిందని, వచ్చే నెలాఖరుకు 75 శాతానికి పైగా పూర్తవుతుందని అంచనా వేశారు. డిసెంబర్ నాటికి రహదారి నెట్‌వర్క్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సిద్ధం చేయనుందని తెలిపారు. అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా సమాంతర రహదారి రూపకల్పన జరుగుతోందని, భూసమీకరణ కొనసాగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ
ట్యాగ్లు
అమరావతి రాజధానిఅమరావతి నిర్మాణంమంత్రి నారాయణఆంధ్రప్రదేశ్ వార్తలురాజధాని అభివృద్ధిమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన
జనరల్

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్
జనరల్

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా
జనరల్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో
జనరల్

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు
జనరల్

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్
సినిమాలు

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?
క్రీడలు

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్
జనరల్

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌
షోస్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!