

హరిద్వార్‌లో 2027 అర్ధ కుంభమేళా నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ వేడుక జనవరి 14న మకర సంక్రాంతితో ప్రారంభమై ఏప్రిల్ 20న చైత్ర పౌర్ణమితో ముగియనుంది. మొత్తం 11 పవిత్ర స్నాన తేదీలను ప్రకటించగా, వాటిలో నాలుగు అమృత స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జనవరి 14న మకర సంక్రాంతి, ఫిబ్రవరి 6న మౌని అమావాస్య, ఫిబ్రవరి 11న వసంత పంచమి, ఫిబ్రవరి 20న మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. మార్చి 6న మహాశివరాత్రి, మార్చి 8న ఫాల్గుణ అమావాస్య, మార్చి 15న దేవ్ డోలీ స్నానం, ఏప్రిల్ 7న నవ సంవత్‌సర స్నానం, ఏప్రిల్ 14న మేష సంక్రాంతి, ఏప్రిల్ 15న రామ నవమి, ఏప్రిల్ 20న చైత్ర పౌర్ణమి స్నానాలు జరగనున్నాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్‌లో చివరిసారిగా 2021లో కుంభమేళా జరగడంతో, 2027లో జరిగే వేడుకను అర్ధ కుంభమేళాగా పిలుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిందూ విశ్వాసాల ప్రకారం కుంభమేళా సమయంలో గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో హర్ కి పౌరి సహా ప్రధాన ఘాట్‌ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!