
బిజినెస్

మెట్రో రైలు కొత్త కోచ్‌ల రాక మరింత ఆలస్యం కానుంది. మొదటి దశ ప్రాజెక్ట్ ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే 60 కొత్త కోచ్‌ల కోసం ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌తో సంప్రదింపులు కూడా జరిపింది.
కానీ ప్రాజెక్ట్ విలువను తిరిగి మదింపు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో స్వాధీన ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎస్‌బీఐ క్యాప్స్ ఈ మదింపు ప్రక్రియ చేపట్టనుండగా కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. రుణ బదిలీ, ఆమోద ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ ఏడాది చివరికి సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త కోచ్‌ల ఆర్డర్ ఆలస్యం కానుండగా, ఆ తర్వాత సరఫరాకు మరో 15 నెలలు పడుతుంది. ఫలితంగా ప్రయాణికులు దాదాపు రెండేళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!