
క్రీడలు

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వెంకట్ రెడ్డి (38) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కారు నడిపిన వ్యక్తిని బీటెక్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!