
జనరల్

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిధిలో ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత మృతి చెందింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె విషపదార్థం తీసుకున్న అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్‌రెడ్డి ఏకైక కుమార్తె అయిన యశ్విత, గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీ పరీక్షకు సిద్ధమవుతోంది.
కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యశ్విత మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!