
జనరల్

అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పలువురు భక్తులకు లగేజీ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలిపిరి వద్ద డిపాజిట్ చేసిన సామాన్లు తిరుమలకు చేరుకోవడంలో ఆలస్యం కావడంతో, భక్తులు తిరుమల జీఎన్‌సీ కౌంటర్ వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
లగేజీ కోసం కౌంటర్ వద్ద భారీగా భక్తులు బారులు తీరుతున్నారు. సామాన్లు అందకపోవడంతో కొందరు భక్తులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నడకదారిలో తిరుమలకు చేరుకున్నప్పటికీ లగేజీ కోసం మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!