
బిజినెస్

నార్వే రాజు ఐదవ హరాల్డ్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆగస్టు 28న ఓస్లో యూనివర్సిటీ ఆస్పత్రిలో ఉదయం 6:35 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు నార్వే రాజభవనం ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైగా దేశానికి రాజుగా సేవలందించిన హరాల్డ్.. నార్వే రాచరిక వ్యవస్థను ఆధునీకరించిన రాజుగా గుర్తింపు పొందారు.
హరాల్డ్ మరణంతో ఆయన 53 ఏళ్ల కుమారుడు హాకోన్-8 నార్వే రాజుగా బాధ్యతలు చేపట్టారు. హాకోన్ కుమార్తె ఇన్‌గ్రిడ్ అలెగ్జాండ్రా పట్టపు రాకుమారిగా, భవిష్యత్తులో సింహాసన వారసురాలిగా నిలవనున్నారు. నార్వేలో రాజు పదవి ప్రధానంగా లాంఛనప్రాయమైనదే కాగా, పాలనా అధికారం ప్రజలచే ఎన్నికైన పార్లమెంట్, ప్రభుత్వానిదే. హరాల్డ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ.. నార్వేకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!