
జనరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం నమోదవుతోంది. ఇదే సమయంలో రసువా జిల్లాలోని భోటే కోశి ప్రాంతంలో వరదలకు కొట్టుకువచ్చిన ఓ బ్యాంకు లాకర్ ధాడింగ్ జిల్లాలోని నది తీరంలో కనిపించింది. దాన్ని గుర్తించిన కొందరు స్థానికులు ఇళ్లకు తీసుకెళ్లి పగలగొట్టి, అందులోని నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ధాడింగ్ జిల్లా పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారత కరెన్సీలో సుమారు రూ.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వరదల కారణంగా బ్యాంకు లాకర్ కొట్టుకువచ్చినట్లు గుర్తించిన పోలీసులు, నగదు చోరీకి పాల్పడిన వారిపై తదుపరి చర్యలు చేపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!