
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం తప్పింది. ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు రేగుపాలెం జంక్షన్ వద్ద ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.
అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగి ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!