

హైదరాబాద్ మెట్రోకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీతో ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణారావు సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల విధానంలో ఈ రుణ సౌకర్యం అందించనున్నారు.
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ, మెట్రోలో 100 శాతం యాజమాన్య వాటా ప్రభుత్వానికి బదిలీ అయినట్లు తెలిపారు. పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశ ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. మెట్రో కనెక్టివిటీ బలోపేతంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ రీఫైనాన్స్ ప్రక్రియలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్‌ఎల్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!