
జనరల్

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనుప్ బాగ్చీ నియమితులయ్యారు. ఆయన నియామకానికి బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఆయన నియామకానికి అనుమతి ఇచ్చింది. మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్న బాగ్చీ అక్టోబర్ 27, 2026న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఉన్న శశిధర్ జగదీశన్ అక్టోబర్ 26న తన పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు. పునర్నియామకం కోసం పరిశీలనలో ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్న నేపథ్యంలో తదుపరి ఎండీ, సీఈఓ ఎంపిక ప్రక్రియను బ్యాంక్ బోర్డు చేపట్టింది. ప్రస్తుతం అనుప్ బాగ్చీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!